VM Today News - బ్రేకింగ్ న్యూస్ / పల్నాడు : వినుకొండ పట్టణంలో ఫిబ్రవరి 21న నిర్వహించనున్న స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మంగళవారం పట్టణంలో పర్యటించారు. స్థానిక జూనియర్ కళాశాల హెలిప్యాడ్ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఎన్‌ఎస్‌పీ కాలనీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని తనిఖీ చేశారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోని బయో మెడికల్ వేస్ట్ స్టోరేజ్ గదిని పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రత, పారిశుధ్యం, విద్యుత్ ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ మధులతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
VMToday News