VM Today News - క్రైమ్ వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలోని పెద్ద బజారులో ఉన్న బంగారు కోట్ల సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా భారీగా ఎగిసిపడటంతో స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చారు. వాటర్ ట్యాంకులతో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే లక్షల రూపాయల మేర నష్టం సంభవించింది. ఈ ఘటనతో షాపు యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Reporter
VMToday News