VM Today News - రాజకీయం / పల్నాడు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 21వ తేదీన వినుకొండ పట్టణంలో పర్యటించనున్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలో పారిశుద్ధ్య పనులు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గురువారం వినుకొండలో పర్యటించి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు సీఎం బహిరంగ సభ నిర్వహించనున్న ఎన్ఎస్పీ గ్రౌండ్ ను సందర్శించి వేదిక నిర్మాణం ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు సీఎం హెలికాప్టర్ దిగేందుకు సిద్ధం చేస్తున్న జూనియర్ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించి భద్రతా చర్యలపై ఆరా తీశారు జూనియర్ కాలేజీ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అవసరమైన ఏర్పాట్లపై అధికారులను ఆదేశించారు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీవీ ఆంజనేయులు సూచించారు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా ఎస్పీ కృష్ణారావు ఇతర అధికారులు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు
Reporter
VMToday News