VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో శివయ్య స్తూపం సెంటర్‌లో మెడికల్ మాఫియాపై ఆందోళన చేపట్టారు. ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రాము డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వైద్య సదుపాయాల లేమితో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు వివిధ పరీక్షల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. గుర్తింపు లేని ఔషధాల విక్రయంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. వైద్య, డ్రగ్స్ నియంత్రణ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వినుకొండలో ఆర్థోపెడిక్ వైద్యుడు లేక రోగులను నరసరావుపేటకు తరలిస్తున్నారని తెలిపారు. అక్రమ డ్రగ్స్ విక్రయాలపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Reporter
VMToday News