Sunday, 05 April 2026 12:02:46 AM
# బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్

ధైర్యసాహసాలకు గుర్తింపుగా సి.ఐ. ప్రభాకర్‌కు శాలువాతో సత్కారం

Date : 17 February 2026 09:32 PM Views : 84

VM Today News - వార్తలు / పల్నాడు : నరసరావుపేట పట్టణంలోని కాకుమాను బజార్లో మహాశివరాత్రి సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలో పట్టణ టూ టౌన్ సి.ఐ. ప్రభాకర్ గారు ప్రదర్శించిన ధైర్యసాహసం ప్రశంసలు అందుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను చాకచక్యంగా రక్షించి వారి ప్రాణాలను కాపాడిన ఆయన సేవాభావాన్ని స్థానికులు కొనియాడారు. ఈ నేపథ్యంలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభాకర్ గారికి సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభాకర్ గారికి ఇలాంటి సాహసాలు కొత్తవి కాదని తెలిపారు. గతంలో షాపింగ్ మాల్ ఘటనలోనూ ఆయన సమయోచిత నిర్ణయాలతో ప్రజలను రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఆయన చూపిన పట్టుదల, ప్రకృతిపై ఉన్న అభిరుచి ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంకాయలపాటి రవి (అడ్వకేట్), రిటైర్డ్ ఏ.ఎస్.ఐ. సలాం గారు మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని దేవుని ప్రార్థించారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :