VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలోని మిద్దబాయి కాలనీలో ఆదివారం వీధి కుక్కల దాడిలో ఒక బాలుడికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఇది గమనించిన వారి తల్లితండ్రులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ మధ్యకాలంలో వీధి కుక్కల కారణంగా ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాము. ఇలాంటి ఘటన వల్ల పట్టణంలో ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నారులను స్కూలుకి పంపించాలన్న భయపడాల్సిన పరిస్థితి నెలకొంది వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వీధి కుక్కలు బెడద నుండి కాపాడాలని కోరుతున్నారు.
Reporter
VMToday News