Saturday, 04 April 2026 11:59:27 PM
# బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్

పేద ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్..

వాటి గడువు మరో ఏడాది పెంపు! వెంటనే అప్లై చేసుకోండి!

Date : 15 February 2026 09:54 AM Views : 98

VM Today News - వార్తలు / గుంటూరు : రాష్ట్రంలోని అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లు ఏర్పాటు చేసుకున్న పేదలకు సర్కార్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో ఉన్న నివాస గృహాల క్రమబద్ధీకరణ పథకాన్ని మరోసారి పొడగించింది. ప్రభుత్వ భూముల్లో జనాలు ఏర్పాటు చేసుకున్న నివాసాల ఆక్రమణలను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు నిర్ణిత గడువుతో ప్రభుత్వం గతంలో పేదలకు అవకాశం కల్పించింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు గతేడాది డిసెంబర్ 31తోనే ముగిసిపోయింది. అయితే ప్రజల అభ్యర్థన మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్‌రావు గడువు పొడగించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ గడువును మరో ఏడాది పాటు అనగా డిసెంబర్ 2026 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో నం.115 ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే గతంలో జీవో నెంబర్ 30లో భాగంగా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణను ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈ పథకం గురించి జనాల్లో అవగాహన లేకపోవడంతో చాలా మంది దీని కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019 అక్టోబరు 15 తేదీకి ముందు నుంచి అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి మాత్రమే ఇళ్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. అయితే150 జాలలోపు ఇళ్లు స్థలం ఉన్నవారు తమ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 150 నుంచి 450 గజాల మధ్య ఉన్నవారు రిజిస్ర్టేషన్‌ విలువలో 50శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :